తెరాసలోకి మరో ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు జంప్

ఆలాగే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా త్వరలో కాంగ్రెసుకు రాజీనామా చేసి తెరాసలో చేరుతారని అంటున్నారు. ఆయన శనివారం తన నియోజకవర్గం కొల్లాపూర్ కార్యకర్తలతో మాట్లాడారు. రేపు ఆదివారం మరోసారి హైదరాబాదులో తన ముఖ్య అనుచరులతో సమావేశమై కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెరాసలో చేరే విషయంపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని భావిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు తెరాసవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, తెరాసలో చేరాలని అనుకుంటున్న శాసనసభ్యుల విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి వచ్చింది.
కాగా, కాంగ్రెసుకు చెందిన ఇద్దరు తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కూడా తెరాస నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పార్లమెంటు సభ్యులకు గాలం వేసేందుకు తెరాస చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. తెరాసలో చేరే విషయంపై అనుకూలంగా గానీ ప్రతికూలంగా గానీ ఆ ఇద్దరు పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు ఇంతకు ముందు గాలం వేసిన తెరాస ఇప్పుడు కాంగ్రెసుపై దృష్టి సారించింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications