ఎంత మంది వెళ్లినా కాంగ్రెసుకు నష్టం లేదు: లగడపాటి

కాంగ్రెసుకు చెందిన మరో ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ముగ్గురు శానససభ్యులు రాజీనామాలు చేస్తారనేది అవాస్తవమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీ కనుమరుగవుతుందనేది అబద్ధమని ఆయన అన్నారు. జాతీయ పార్టీ అయిన కనుమరుగవుతుందని ఓ ఉప ప్రాంతీయ పార్టీ చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తెరాస శాసనసభ్యులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications