జైల్లో మధు కొడాను కొట్టిన అధికారులు, విరిగిన చేయి

జైలులో గుమిగూడిన ఖైదీలను చెదరగొట్టడానికి బాటోన్స్‌ను ప్రయోగించామని, ఇందులో మధు కొడా గాయపడ్డారని జైలు అధికారులు చెబుతున్నారు. కొడాను సందర్శించడానికి వచ్చిన వారు కూడా అధికారుల దెబ్బలకు గాయపడినట్లు సమాచారం. సందర్శకులపై పరిమితి విధించినట్లు, అయితే మధు కొడా తన వద్దకు ఎక్కువ మంది సందర్శకులను అనుమతించాలని అడిగినట్లు, జైలు అధికారులు నిరాకరించడంతో కొడా, ఆయన అనుచరులు ప్రజలను కలవడానికి జనరల్ వార్డుకు వెళ్లారని చెబుతున్నారు.
జనరల్ వార్డు ఖైదీలతో మధుకోడా, ఆయన అనుచరులు కలిసిపోయారని, ఈ స్థితిలో ఖైదీలను చెదరగొట్టడానికి బటోన్స్ ప్రయోగించారని, ఇందులో కొడా గాయపడ్డారని అంటున్నారు. మధు కొడాను రాంచీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్ల్)లో చేర్చారు. నాలుగు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మధు కొడా 2009 నవంబర్ నుంచి జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications