కెసిఆర్‌వి అహంకార వ్యాఖ్యలు: వి హనుమంత రావు

ఇన్నాళ్లూ కాంగ్రెసు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలూ జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్యలు బయటకు వెళ్లడం బాధాకరమని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారటం కెసిఆర్ కుట్ర అని విమర్శించారు. తెలంగాణ అంటే మేమే అని మిగతా వారు ఎవరూ కాదన్న కృత్రిమ వాతావరణాన్ని సృష్టించేందుకు టిఆర్ఎస్ ప్రయత్సిస్తోందన్నారు. కాంగ్రెసు త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. టిఆర్ఎస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు మూర్ఖులని జగ్గారెడ్డి అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో వారు దౌర్భాగ్యం అనుభవిస్తారన్నారు. వారు సొంత బలం లేకే టిఆర్ఎస్‌లోకి వెళ్లారన్నారు.
కాగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా టాంక్‌బండ్ పైనున్న ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ భవనంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో విహెచ్, దానం, గీతారెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications