సమైక్యాంధ్ర వైఖరిని బయటపెట్టుకున్న చంద్రబాబు

రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రయోజనం లేదని, నిత్యావసర సరుగుల ధరలు తగ్గిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఏదో ఒక పథకం ప్రారంభించాలి కాబట్టే రూపాయికి కిలోబియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. దానివల్ల పేదలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మార్పు తెచ్చామని ఆయన అన్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రులను మార్చడం, అభివృద్ధిని విస్మరించడం కాంగ్రెసుకు ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 700 మండలాల్లో కరువు నెలకొందని, కరువు సహాయ చర్యల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన అన్నారు. పోలవరం టెండర్లలో రికార్డులను తారుమారు చేశారని చంద్రబాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications