హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస ప్రతిపాదనకు ఎర్రబెల్లి కొలికి

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే, దానికి ఆయన ఓ కొలికి పెట్టారు. తాము ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు శాసనసభ్యులు గవర్నర్‌కు లేఖలు ఇవ్వాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యులు గవర్నర్‌కు ఆ లేఖలు ఇవ్వాలనేది ఆయన ఉద్దేశ్యం. శాసనసభ్యులు గవర్నర్‌కు లేఖలు ఇచ్చినప్పుడే ప్రభుత్వం పడిపోతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర అవతరణను వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం ఢిల్లీలోని ఎపి భవన్‌లో నల్లజెండా ఆవిష్కరించారు. రాజకీయాలే కేంద్రంగా పోరాడితే తెలంగాణ రాదని ఆయన అన్నాైరు. తెలంగాణ వచ్చే వరకు ఏ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షలో పాల్గొనడానికి ఆయనతో పాటు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన బాపూజీ కాంగ్రెసుకు, ఆంధ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారని, బాపూజీకి తమ మద్దతు ఉంటుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

English summary
TDP Telangana forum convener Errabelli Dayakar Rao put condition to propose no confidence motion on Kiran government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X