హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో మళ్లీ టెన్షన్, గన్ పార్క్ ర్యాలీ ఉద్రిక్తం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osamania University
హైదరాబాద్: నవంబర్ 1వ తేదిని విద్రోహ దినంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వరకు చేపట్టిన ర్యాలీ మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి ఉదయం ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పరిసరాలు దాటి రాకుండా పోలీసులు అన్ని మార్గాల్లోనూ భారీగా మోహరించారు. విద్యార్థులు ర్యాలీగా ఎన్‌సిసి గేటు వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులు మాత్రం తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసులు ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చాలని చూస్తున్నారని, తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.

బయటకు వెళ్లడానికి వారికి పోలీసులు ఎంతకూ అనుమతించలేదు. దీంతో రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. గతంలో విద్యార్థులు రెచ్చిపోయి రాళ్లు రువ్వగానే పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వంటివి చేసే వారు. కానీ ఈ సారి మాత్రం పోలీసులు సంయమనం పాటించారు. వారు ఎంతగా రాళ్లు రువ్వినప్పటికీ శాంతియుతంగా విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. పరిస్థితి మరీ అదుపు తప్పడంతో ఓసారి మాత్రం బాష్పవాయువు ప్రయోగించడం మినహా పోలీసులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయలేదు. సుమారు పదిహేను, ఇరవై నిమిషాలపాటు విద్యార్థులు రాళ్లు రువ్వారు.

English summary
TRSV gun park rally created very tension at Osmania University today. Police obstructed students at NCC gate. Students thrown stones at police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X