జగన్ కేసు, సిబిఐ ముందు విజయసాయి రెడ్డి

వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే 90 శాతం దర్యాప్తును పూర్తి చేసినట్లు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలను నిందితుల వాంగ్మూలాలతో సిబిఐ అధికారులు సరిపోల్చి చూస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో జగన్‌కు ఉన్న సంబంధాలపై కూడా సిబిఐ అధికారులు విజయసాయి రెడ్డిని అడిగి వివరాలు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ తమ ముందు ఈ నెల 4వ తేదీన హాజరు కావాలని వైయస్ జగన్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications