కెవిపి రామచందర్ రావును దువ్వుతున్న వైయస్ జగన్

వైయస్ జగన్ సమీప బంధవు, వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే రెండు సార్లు కెవిపిని కలిసి మద్దతు అడిగినట్లు ఆ ఆంగ్లపత్రిక రాసింది. వైవి సుబ్బారెడ్డి మాత్రమే కాకుండా భూమానాగిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి కూడా కెవిపిని కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. కెవిపి కాంగ్రెసును వదిలి రావాల్సిన అవసరం లేదని, ఆయనకు చెందిన 20 మంది శాసనసభ్యులు వచ్చే శాసనసభా సమావేశాల్లో కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు చేస్తే చాలునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. అయితే, ఇక్కడ జగన్‌కు కలిసి వచ్చే అంశం ఉందని భావిస్తున్నారు. కెవిపికి చెందిన ఎమ్మెల్యేలను పట్ల కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం పెద్దలు పట్టించుకోవడం లేదని, దాంతో వారంతా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కెవిపి గత నాలుగు నెలలుగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే ఫలితం లేకుండా పోయిందని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కెవిపికి సోనియాను కలిసే అవకాశం రావడం లేదని ఓ సీనియర్ కాంగ్రెసు నేత అన్నట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది.
తీవ్ర అసంతృప్తితో ఉన్న కెవిపి రామచందర్ రావు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని అనకుంటే జగన్ లక్ష్యం నెరవేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్, కెవిపిల మధ్య విభేదాలు కూడా తగ్గుతున్నట్లు, వచ్చే కొద్ది కాలంలో అవి సమసిపోయి సామరస్యపూరిత సంబంధాలు నెలకొనవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఆశిస్తున్నారు. ఇందుకు కెవిపితో మరిన్ని సమావేశాలు జరుగుతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications