సిఎంతో విభేదించిన మంత్రులు, బహిరంగ వ్యాఖ్యలు

Sridhar Babu-DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో లుకలుకలు బయటపడుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు గురువారం ప్రకటన చేశారు. ఇప్పటికే కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నిర్ణయంతో విభేదించారు. రూపాయికి కిలోబియ్యం పథకంపై మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, శ్రీధర్ బాబు విభేదించారు. తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే రూపాయికి కిలో బియ్యం పథకం తగదని వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. కడప జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, తన వ్యక్తిగతాభిప్రపాయమని అన్నారు. గతంలో ప్రభుత్వం 108, 104 సర్వీసులను ప్రవేశపెట్టి వాటిని నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. రూపాయికి కిలో బియ్యం పథకానికి కూడా అదే గతి పడుతుందేమోనని ఆయన భావించి ఉండవచ్చునని అంటున్నారు.

కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు కూడా రూపాయికి కిలో బియ్యం పథకాన్ని వ్యతిరేకించారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుతున్న క్రమంలో రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. తాను రూపాయికి కిలో బియ్యం పథకాన్ని సమర్థించబోనని ఆయన స్పష్టంగానే చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తొలి రోజే బియ్యంలో పురుగులు రావడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉద్దేశ్యపూర్వకంగా పురుగులు ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రూపాయికి కిలో బియ్యం పథకంపై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రయోజనం ఉండదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని, ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే మంచిదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+