కోనేరు ప్రసాద్‌కు వారం రోజుల సిబిఐ కస్టడీ

విదేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన తర్వాత కోనేరు ప్రసాద్‌ను గురువారం సిబిఐ అధికారులు దిల్‌కుషా అతిథిగృహానికి పిలిపించారు. కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం ఆయనను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తమ కస్టడీకి అప్పగించాలనే సిబిఐ విజ్ఞప్తిపై కోనేరు ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కీలక నిందితుడిగా ఉన్న కోనేరు ప్రసాద్ నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున, తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ వాదించింది. సిబిఐ అధికారులు ఏమైనా వేధించారా అని న్యాయమూర్తి అడిగితే లేదని కోనేరు ప్రసాద్ సమాధానం ఇచ్చాడు. సిబిఐ కస్టడీకి అప్పగించడానికి ఉన్న అభ్యంతరాలేమిటో తెలియజేస్తూ గంటలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోనేరు ప్రసాద్ న్యాయవాదిని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను గంటపాటు వాయిదా వేశారు.
కోనేరు ప్రసాద్‌ను ఇప్పటికే చాలా సార్లు విచారించారని, కోనేరు ప్రసాద్ వద్ద పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారని, అందువల్ల కోనేరు ప్రసాద్‌ను సిబిఐ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఎమ్మార్ అక్రమాల్లో పలువురు ప్రముఖులకు సంబంధాలున్నాయని, ఇందులో ఎవరెవరున్నారనేది కోనేరు ప్రసాద్‌కే తెలుసునని, ఆ సమాచారం రాబట్టాల్సి ఉందని సిబిఐ వాదించింది. వాదనలు తిరిగి ప్రారంభమైన తర్వాత కోనేరు ప్రసాద్‌ను ఏడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాది అశోక్ వర్ధన్ సమక్షంలో కోనేరు ప్రసాద్‌ను విచారించాలని న్యాయమూర్తి సిబిఐని ఆదేశించారు.












Click it and Unblock the Notifications