వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై నిర్ణయం జనవరిలోగా వస్తుంది: సింఘ్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Abhishek Manu Singhvi
హైదరాబాద్: తెలంగాణపై జనవరిలోగా నిర్ణయం వెలువరిస్తామని, ఈ విషయం రాష్ట్రంలోని తమ పార్టీ నేతలకు తెలుసునని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. ఆ విషయం తెలిసి కూడా తమ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడం తొందరపాటు చర్యేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముగ్గురు శానససభ్యులు తెరాసలో చేరడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు తొందరపడి పార్టీలు మారితే తెలంగాణ రాదని ఆయన అన్నారు. తెలంగాణ వంటి క్లిష్టమైన, సున్నితమైన సమస్య పరిష్కారానికి సహనం, ఓర్పు అవసరమని ఆయన అన్నారు.

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు జరుగుతోందని, చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడం తమ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సమయంలో తొందరపడి పార్టీలు మారడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జనవరిలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినా ఆ ముగ్గురు శాసనసభ్యులు తెరాసలోకి వెళ్లారని ఆయన అన్నారు. తెలంగాణ వంటి సమస్యల విషయంలో రాజనీతిజ్ఞత ప్రదర్శించాలని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ చేతులు ముడుచుకుని కూర్చుందని అనడం సరి కాదని, సమస్య పరిష్కారానికి కసరత్తు జరుగుతోందని ఆయన అన్నారు.

English summary
AICC spokesperson Abhishek Manu Singhvi said that decission on Telangana will be delivered before January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X