తెలంగాణ మంత్రులకు బుద్ధి లేదు: నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ మంత్రులపై తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు బుద్ధి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ చిల్లర సరుకుల్లా అమ్ముడు పోతున్నారని ఆయన విమర్శించారు. డి. శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి అమ్ముడు పోయారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఇవ్వక తప్పదని ఆయన అన్నారు. తెలంగాణకు ప్యాకేజీలు, మండళ్లు అవసరం లేదని, రాష్ట్రం ఏర్పాటే కావాలని ఆయన అన్నారు. బలగాలను మోహరించి తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరని ఆయన అన్నారు.

పిడి యాక్ట్, నాసాలతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టారు. వారేదో చేసుకుంటారు, తనకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. డిఎస్పీ నళినిని సస్పెండ్ చేయడాన్ని ఆయన ఖండించారు. నళిని రాజీనామా ఇస్తే ఆమోదించకుండా సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే నళినికి డబుల్ ప్రమోషన్ ఇస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+