కొండారెడ్డి స్టోరీ: అంగీకరించిన జగన్ వర్గం ఎమ్మెల్యే

Srikanth Reddy
హైదరాబాద్: తమ నేతను సిబిఐ విచారించే సందర్భంలో పక్క గదిలో కొండా రెడ్డి ఉన్నాడనే వార్తలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి పరోక్షంగా అంగీకరించారు. జగన్‌ను విచారించే సందర్భంలో పక్క గదిలో కొండా రెడ్డి ఉన్నట్లు, కొండా రెడ్డిని ఫేస్ చేస్తారా అని సిబిఐ అధికారులు జగన్‌ను అడిగినట్లు, అందుకు జగన్ నిరాకరించినట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తాకథనాలను తిప్పికొట్టడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రీకాంత్ రెడ్డి సోమవారం పరోక్షంగా ఆ వార్తాకథనాలను ధ్రువీకరించారు. ఆ రెండు దినపత్రికలను ఎల్లో మీడియాగా అభివర్ణిస్తూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

కొండారెడ్డి అనే వ్యక్తి పేరు పెట్టి ఎల్లో మీడియా విషం కక్కుతూ తప్పు కథనాలను రాసిందని అంటూనే ఇదంతా చూస్తుంటే లోపల జరిగిన విషయాలను సిబిఐ లీక్ చేస్తుందా అనే అనుమానం కలుగుతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిబిఐ కార్యాలయం లోపల జరిగిన విషయాలు ఎల్లో మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ఆయన అడిగారు. ఈ మాటలను బట్టి ఎల్లో మీడియాగా అభివర్ణిస్తున్న వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు నిజమేనని అనిపించేలా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. జగన్ ఇంటి విషయంలో కూడా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ విషయాలపై సిబిఐ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని ఆనయ వ్యాఖ్యానించారున. జగన్‌ను అరెస్టున చేస్తారని ఎల్లో మీడియా పదే పదే రాయడం చూస్తుంటే ఈ అసత్య ప్రచారం వెనక కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. జగన్‌ను దెబ్బ తీయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో జగన్ ఒక సాక్షిగా మాత్రమే సిబిఐ ముందు హాజరయ్యారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+