ఢిల్లీ గడ్డపై కేంద్రంపై శివాలెత్తిన ఎంపీ మధు యాష్కీ

తెలంగాణ కోసం తొమ్మిది మంది పార్లమెంటు సభ్యులం పార్టీని, పదవులను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే లక్ష్మణ్ బాపూజీ ఆధ్వర్యంలో జెండాలు పక్కన పెట్టి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బాపూజీ దీక్షకు మంత్రి శంకర్ రావు సంఘీభావం తెలిపారు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణను ప్రకటించాలన్నారు. లక్ష్మణ్ తెలంగాణకు బాపూజీ అని కొనియాడారు. కాగా హైదరాబాదులోనూ కాంగ్రెసు సీనియర్ నేత జి వెంకట స్వామి(కాకా) కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం బాగుపడ్డాక తడాఖా చూపిస్తాననీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications