సొంత ఇళ్లకు 60 రోజుల తర్వాత ఆ ఇద్దరు మంత్రులు

పొన్నాల లక్ష్మయ్య జనగాం నియోజకవర్గంలో, సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలంగాణవాదుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతో అధికారులు ఇప్పటి వరకు జిల్లాలో రచ్చబండను ప్రారంభించలేదు. నిరుడు కూడా వరంగల్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమం విఫలమైంది. రచ్చబండ కోసం రాయినిగూడెం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మహిళలు ప్రతిఘటించారు. దీంతో ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications