బాబుపై దుమ్మెత్తిపోసిన అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి

గవర్నర్, స్పీకర్ ప్రభుత్వంతో లాలూచీ పడిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ సరిగా పనిచేసినా కిరణ్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన అన్నారు.
అధికార దాహంతో, కుర్చీ మీది వ్యామోహంతో చంద్రబాబు నాయుడు రైతు జపం చేస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఆకుపచ్చ కండువా వేసుకుని తిరిగినంత మాత్రాన ప్రజల చంద్రబాబును నమ్మబోరని ఆమె అన్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి కారణం చంద్రబాబేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications