కసబ్ ఉగ్రవాది, ఉరి తీయాలి: పాక్ మంత్రి మాలిక్

ముంబై దాడుల్లో పాకిస్తానీల పాత్ర ఉందని జుడిషియల్ కమిషన్ తగిన సాక్ష్యాధారాలు చూపితే నిందితుల ప్రాసిక్యూషన్‌కు తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఆ కమిషన్ భారతదేశానికి వెళ్లినప్పుడు న్యాయ ప్రక్రియకు దాని నిర్ధారణలు అత్యంత ప్రధానమైనవని, నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి అది సహాయపడుతుందని ఆయన అన్నారు. అతిథులుగా అంగీకరిస్తే జుడిషియల్ కమిషన్ ప్రతినిధులు మూడు, నాలుగు రోజులు భారతదేశంలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ కమిషన్ నివేదిక వస్తే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. జమాత్ ఉద్ దావా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు విడుదల చేయడంపై ప్రశ్నించగా పాకిస్తాన్ అత్యున్నత కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications