తెలంగాణపై నిర్ణయం మీద మా వద్దకు రావచ్చు: సుప్రీం

కోర్టులు నడపటడం లేదన్న పిటిషన్ పైన విచారణ చేపట్టిన కోర్టు ప్రతివాదులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరువారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో విధుల బహిష్కరణపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర బార్ కౌన్సిల్ కు సూచనలు జారీ చేసింది. విధులకు గైర్హాజరు కావాలంటూ పిలుపునిచ్చిన న్యాయవాదుల సంఘంపై ఏం చర్యలు తీసుకున్నదీ అఫిడవిట్ లో తెలియజేయాలని సూచించింది. హైకోర్టు ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని బార్ కౌన్సిల్ తో పాటు హైకోర్టు, సిఎస్ లకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
శ్రీకృష్ణ కమిటీలోని నిర్ణయాలను అమలు చేయాలని తాము కేంద్రాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. అయితే కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాక ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది. సమ్మె కాలంలో జరిగిన ఆస్తి నష్టం, ఆత్మహత్యలపై కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, డిజిపి, హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, టిఎన్జీవో నేత స్వామి గౌడ్ తదితరులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications