చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభకు ఎంపిక?

మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలలోగా పార్లమెంటు ఉభయసభల్లో దేనికైనా ఒకదానికి ఎంపికైతే చాలు. అందువల్ల ముందు చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన సాగుతోంది. ఏప్రిల్ లేదా మేలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయిస్తారని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో చిరంజీవిని సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన సాగుతోందని అంటున్నారు. ఇటీవల తిరుపతిలో తనకు కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ మంత్రి పదవి ఇస్తే మరింత సేవ చేయడానికి వీలవుతుందని చిరంజీవి అన్నారు. దీన్ని కూడా కాంగ్రెసు అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications