జగన్ కేసులో ఐఎఎస్ అధికారి భానుకు సిబిఐ నోటీసు

కాగా, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌ను అరెస్టు చేసిన సిబిఐ మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆమె చెన్నైలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేదని ఆమె తెలిపినట్లు చెబుతున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఆమె సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఆమె బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం మరో ఐఎఎస్ అధికారికి అప్పగించింది.
ఇదిలా ఉంటే, గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి బెయిల్ పిటిషన్లపై కోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లపై మంగళవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.












Click it and Unblock the Notifications