వైయస్‌ను అనుమానించే రీతిలో విజయమ్మ: రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డిని అనుమానించే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వేసిన పిటిషన్ ఉందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆస్తులపై కేసు వేసి వైయస్ రాజశేఖర రెడ్డి ఉపసంహరించుకున్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబుపై వెలువడిన 18 తీర్పులను విజయమ్మ తన పిటిషన్‌లో పేర్కొనకపోవడంలోనే రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. విజయమ్మ పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆయన అన్నారు. కెజి బేసిన్ కేటాయింపులు అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగాయని ఆయన అన్నారు.

కాకినాడ పోర్టు కేటాయింపులో ప్రభుత్వ వాటాను తగ్గించింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన విమర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి భూమి కేటాయింపు కూడా నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణలను కాంగ్రెసు ప్రభుత్వం ఏడున్నరేళ్ల పాలనలో నిరూపించలేకపోయిదని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ ఒప్పందాలపై వైయస్ ప్రభుత్వం మంత్రి ఉప సంఘంతో సమీక్ష జరిపించిందని ఆయన గుర్తు చేశారు. బ్రిటిష్ సంస్థ స్కైవేస్ నివేదిక ఆధారంగా శంషాబాద్ విమానాస్రయం రూపకల్పన జరిగిందని ఆయన చెప్పారు. కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలోనే విద్యుత్తు ఒప్పందాలు జరిగాయని ఆయన చెప్పారు. విజయమ్మ తన పిటిషన్‌లో చేసిన ఆరోపణలకు ఆయన వివరంగా సమాధానాలిచ్చారు.

రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విజయమ్మ కోర్టులో పిటిషన్ వేశారని తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. విజయమ్మ పిటిషన్ వల్ల ప్రజల్లోకి తప్పుడు భావనలు వెళ్తాయనే ఉద్దేశంతోనే తాము వివరణ ఇస్తున్నామని ఆయన చెప్పారు. సిబిఐ దర్యాప్తునకు తాము భయపడడం లేదని, హైకోర్టు ఆదేశాలను తాము తప్పు పట్టడం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+