వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి కేసు: పూర్తి నివేదికకు జనవరి 15 వరకు గడువు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ అక్రమ మైనింగ్ పైన అధ్యయనం చేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌(ఐసిఎఫ్ఆర్ఈ)ను ఆదేశించింది. తుముకూరు, చిత్రదుర్గ జిల్లాల్లోని ఓఎంసి మైనింగ్‌పై అధ్యయనం చేయమని ఐసిఎఫ్ఆర్ఈకి ఆదేశాలు జారీ చేసింది. అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ప్రతిని ప్రతివాదులకు కూడా అందజేయాలని సూచించింది.

గాలి ఓఎంసికి సంబంధించి సిబిఐ సమర్పించిన నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించింది. గాలి మైనింగ్ పైన మరికొంత సమాచారం సేకరించేందుకు తమకు మరింత గడువు కావాలని సిబిఐ కోర్టును కోరింది. డిసెంబర్ 4వ తేది వరకు ఓఎంసి కేసుపై ఛార్జీషీటు దాఖలు చేస్తామని చెప్పింది. అందుకు అంగీకరించిన కోర్టు జనవరి 15లోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని, అలాగే ఛార్జీషీట్‌లోని వివరాలను తదుపరి నివేదికలో పొందుపర్చాలని ఆదేశించింది.

English summary
Supreme Court ordered CBI to give full pledged report on Obulapuram Mining Corporation before January 15th of 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X