వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులు కలుపుదాం: చైనా ప్రధానితో మన్మోహన్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
బాలి: 21వ దశాబ్దం ఆసియా దేశాలదేనని, అందుకుగానూ భారత్-చైనాలు చేతులు కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత్ విశ్వసిస్తోందని ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ చైనా ప్రధాని వెన్‌జియాబావోతో అన్నారు. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి అక్కడికి చేరుకున్న మన్మోహన్ సింగ్ శుక్రవారం చైనా ప్రధాని వెన్‌జియాబావోతో సమావేశమయ్యారు.

మనం పొరుగువాళ్ళమే కాదు ఆసియాలో అభివృద్ధి చెందుతున్న కీలక దేశాలూ మనవేనని, కాబట్టి మనం ద్వైపాక్షికంగానూ, ప్రపంచ దేశాలతోనూ సహకరించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని మన్మోహన్‌సింగ్ చైనా ప్రధానితో అన్నారు. ప్రధాని వ్యాఖ్యలతో ఏకీభవించిన వెన్‌జియాబావో ఇరు దేశాలూ పరస్పర సహకారంతో ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. పరస్పర లబ్దికి ఇరుదేశాలూ కలిసి పని చేయాల్సిన అవసరాన్ని ఇద్దరు ప్రధానులూ అంగీకరించారు.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మన్మోహన్‌సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇరుదేశాల మధ్య అణుఒప్పందంపై వారు చర్చించినట్లు సమాచారం. కాగా నాలుగు రోజుల పాటు ఇండోనేషియా, సింగపూర్‌లో ప్రధాని మన్మోహన్ పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చాయి. అనంతరం మన్మోహన్ ఇండోనేసియా అధ్యక్షుడు సుశీలో బంబాంగ్ యుధోయోనో చర్చలు జరపనున్నారు.

English summary
Prime Minister Manmohan Singh and his Chinese counterpart Wen Jiabao met here on Friday and agreed on the need for working together as there was "enough space" and areas for them to work together for mutual benefit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X