హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిల్లు పెట్టకుంటే హైదరాబాద్ దిగ్బంధం: మందకృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుంటే డిసెంబర్ 17, 18వ తేదీల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం హెచ్చరించారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో హైదరాబాదులో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశాలలో బిల్లు పెట్టాలని లేదంటే వర్గీకరణ బిల్లు కోసం ఉద్యమిస్తామన్నారు.

14న ఉస్మానియా విశ్వవిద్యాలయం, 15న తిరుపతి, 16న ఒంగోలులో మాదిగ విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ బిల్లు పెట్టకుంటే హైదరాబాదును దిగ్బంధిస్తామన్నారు. పార్లమెంటు సమావేశాలలో బిల్లు పెట్టేందుకు చొరవ చూపాలని ముఖ్యమంత్రిని కలిసి కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తికి సిఎం సానుకూలంగా స్పందించారన్నారు.

English summary
MRPS president Manda Krishna Madiga demanded central government to put SC categorization in next sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X