ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకుంటా: శంకరరావు

తనకు ఇష్టం లేకనే మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనడం లేదని ఆయన అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని తిమ్మాపూర్ గ్రామంలో 35 ఎకరాల 27 గుంటల దళితుల భూమిని ఒక మంత్రి వియ్యంకుడికి, మరో మంత్రి తమ్ముడికి కట్టబెట్టేందుకు మంత్రివర్గంలో తీర్మానం చేయడంపై తనకు ఇష్టం లేకనే మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటున్నానని ఆయన చెప్పారు. ఆ భూములను దళితులకు అప్పగించకపోతే కోర్టుకు ఎక్కుతానని ఆయన అన్నారు.
రాష్ట్రంలో సిబిఐకి పెద్ద గిరాకీ ఇచ్చింది తానేనని ఆయన చెప్పుకున్నారు. అంతకు ముందు అధికారులతో నిర్వహించిన సమీక్షలో చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 387 కోట్లు రాష్ట్రానికి మంజూరైనట్లు ఆయన తెలిపారు. తన మంత్రివర్గ సహచరులు సహకరించకపోయినా తనపై వచ్చిన ఆరోపణల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications