వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ లాగే గాలికి ఎదురు గాలి, ఇద్దరు యు టర్న్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులు దూరమవుతున్నట్లే ఇక్కడ మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వర్గం శాసనసభ్యులూ క్రమంగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎపిలో ఇప్పటి వరకు తాము జగన్ నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ఎవరూ ప్రకటించనప్పటికీ స్వయంగా జగనే తన ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు తనతో రాకున్నప్పటికీ తోడుగా ప్రజలు ఉన్నారని చెప్పారు. ఇక్కడ గాలికి సైతం అదే ఎదురు గాలి వీస్తున్నట్లుగా కనిపిస్తోంది. బళ్లారి రూరల్ ఉప ఎన్నికల బరిలో ఇండిపెండెంట్‌గా నిలబడి తమకు సవాల్ విసురుతున్న శ్రీరాములుకు గట్టి గుణపాఠం చెప్పాలని బెంగళూరులో గురువారం సాయంత్రం బిజెపి భేటీ అయి నిర్ణయించుకుంది.

ఈ భేటీకి గాలి శిబిరానికి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఊహించినట్లుగానే డుమ్మా కొట్టారు. కానీ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, నేమీ చంద్రనాయక్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ హాజరయ్యారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు గాలి శిబిరం నుండి మరికొందరు ఎమ్మెల్యేలు బిజెపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గాలి ప్రస్తుతం జైలు గోడలకే పరిమితం కావడం వల్ల బిజెపిలో ఉండటమే మంచిదని పలువురు భావిస్తున్నారట. గాలితో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలలో సాధ్యమైనంత మందిని పార్టీలోకి రప్పించుకునేందుకు బిజెపి కూడా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇండిపెండెంట్‌గా నిలబడుతున్న శ్రీరాములుకు చెక్ చెప్పేందుకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పార్టీ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.

బిజెపి ఎమ్మెల్యేని గెలిపిస్తేనే అక్కడి ప్రజలు స్వాతంత్ర్యం లభిస్తుందని ఆయన చెప్పారు. అదే పాయింటుతో ఆయన శ్రీరాములుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. యడ్డీతో పాటు ముఖ్యమంత్రి సదానంద గౌడ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప విస్తృత ప్రచారం చేయనున్నారు. కాగా గాలి శిబిరంలోని ఎంపీలు ఇద్దరు గురువారం కూడా శ్రీరాములు తరఫున ప్రచారం చేశారు.

English summary
Former Minister Gali Janardhan Reddy camp Two mlas attended to BJP meeting on Thursday in Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X