ఈనాడు రామోజీ రావు పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు

ముప్పయి మూడేళ్లకు ఇచ్చిన లీజు గడువు ముగిసినందున స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఎవిక్షన్ పిటిషన్ వేశారు. ఈ కేసు (సూట్) ప్రధాన పిటిషన్‌లో సవరణలు కోరుతూ మూడు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. కేసు ట్రయల్ దశలో ఉన్నందున సవరణ పిటిషన్లను కొట్టివేస్తూ.. ఈ కేసును విచారిస్తున్న విశాఖపట్నం 9వ అదనపు సెషన్స్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సివిల్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించడాన్ని ప్రశ్నిస్తూ తమ కేసులను మరో కోర్టుకు బదిలీ చేయాలని రామోజీరావు వేర్వేరు పిటిషన్లతో హైకోర్టును ఆశ్రయించారు. వీటిని విచారించిన హైకోర్టు విశాఖలోని సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ రామోజీ పిటిషన్లను తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications