ఎమ్మెల్యేలు వెనక్కి వస్తే జగన్‌కే మంచిది: ఎమ్మెస్సార్

M Satyanarayana Rao
హైదరాబాద్: శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు వైపు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే మంచిదని ఆర్టీసి చైర్మన్, కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. జగన్ వైపు వెళ్లిన శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు వైపు వస్తారని, అలా రావడం శాసనసభ్యులకే కాకుండా జగన్‌కు కూడా మంచిదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సరైన సమయంలో తమ పార్టీ అధిష్టానం తెలంగాణ ఇస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై నమ్మకంతోనే తాము తెలంగాణపై మౌనంగా ఉంటున్నామని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానానికి తెలంగాణ ఇవ్వక తప్పదని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు బాగానే ఉద్యమించారని, ఇంతకన్నా ఏం చేయగలరని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ హయాంలోనే తెలంగాణ ఇవ్వాల్సిందని, ఇప్పటికైనా పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తామంతా కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తొందరపడితే ఎలా అని ఆయన అడిగారు. గవర్నర్ పదవి ఇస్తే తీసుకుంటానని ఆయన చెప్పారు. గవర్నర్ పదవి ఇస్తామని తనకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+