అరసవిల్లిలో దర్శనమిచ్చిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి

ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి చిన్న ధ్వజస్తంభం ముందు వారిని ఆశీర్వదించారు. శ్రీలక్ష్మి రాకను జిల్లా అధికారవర్గాలు అత్యంత గోప్యంగా వుంచాయి. ఉదయం 11 గంటల సమయంలో ఐజీ స్థాయి అధికారి కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శిస్తారని ప్రచారం చేశారు. భద్రత కట్టుదిట్టం చేశారు. వన్‌టౌన్ సీఐ ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీలక్ష్మి దంపతులు సుమారు 20 నిమిషాలపాటు ఆలయంలోనే గడిపారు. దర్శనానంతరం ధ్వజస్తంభం సమీపంలో దేవున్ని ప్రార్థించారు. అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్లి శ్రీకూర్మనాధున్ని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications