వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై దర్యాప్తునకు ఈడి రెడీ, ఫెమా కింద విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం (ఫెమా) కింద విచారణ చేయడానికి న్యూఢిల్లీలోని ఈడి కేంద్ర కార్యాలయం హైదరాబాదులోని జోనల్ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1995 నుంచి 2004 వరకు ఫెమా ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే విషయంపై ఈడి దర్యాప్తు చేస్తుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ మేరకు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని హైకోర్టు సిబిఐనే కాకుండా ఈడిని కూడా ఆదేశించింది.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడి ఆస్తులను సీజ్ అవకాశం ఉంది. అయితే కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేసే వరకు ఈడి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఫెమా కింద మాత్రమే దర్యాప్తును ప్రారంభిస్తుంది. సత్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు బి రామలింగ రాజు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అమెరికాలో చదువుకోవడానికి డబ్బులు చెల్లించారని విజయమ్మ చేసిన ఆరోపణపై ఈడి దర్యాప్తు చేస్తుంది. మాదాపూర్‌లోని భూమిని చంద్రబాబు తల్లి లోకేష్‌కు ఇచ్చిన ఆస్తిపై కూడా ఈడి దృష్టి పెట్టే అవకాశం ఉంది. నారా లోకేష్‌ పేరు మీద బెంగళూర్, నెల్లూరు, ముంబై తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములున్నాయని విజయమ్మ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టుకు ఎన్నారైల నుంచి వస్తున్న విరాళాలపై కూడా ఈడి పరిశీలనలోకి తీసుకుంటుందని అంటున్నారు.

English summary
The Hyderabad zonal office of the Enforcement 
 
 Directorate (ED) has secured the nod from its head office, New Delhi, to inquire into certain Foreign Exchange Management Act (Fema) offences allegedly committed by TDP president N Chandrababu Naidu during his tenure as chief minister of the state between 1995 and 2004.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X