అక్కడ "ఇంధన కోటా" అమల్లోకి..? ఇకపై వారానికి 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దాంతో అటు పేద, మధ్య తరగతి దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడేందుకు పలు దేశాలు ఇంధన కోటాను అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ మేరకు ఇంధన కోటాను విధిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాల్లో వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఇక ఇంధన పంపిణీని క్రమబద్ధీకరించేందుకు ఈ దేశాలు క్యూఆర్ కోడ్(డిజిటల్ పాస్), కూపన్లు లేదా వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా(సరి- బేసి పద్దతి) పెట్రోల్ ను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో కార్లకు వారానికి 15 నుంచి 25 లీటర్లు అలాగే బైక్ లకు 5 లీటర్లు ఇస్తున్నాయి. ఇంధన సంక్షోభం నుంచి బయట పడేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. అటు బంగ్లాదేశ్ లో సైతం ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారు అక్కడి అధికారులు. నేపాల్ చమురు సంక్షోభం నుంచి బయట పడేందుకు పని దినాలను కూడా తగ్గించారు.
అయితే భారత్ లో ప్రస్తుతం అలాంటి ప్రణాళిక ఏదీ లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ రేషనింగ్(కోటా) విధించే ప్రణాళిక ఏదీ లేదు. భారత్ వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు ఇటీవల పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అలాగే 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు మరోవైపు ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. అంతేకాక ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. అలాగే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications