హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ఎమ్మెల్యేనే: జగన్ వర్గం భారతి మాట మారింది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Korla Bharathi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డికి టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతి కాంగ్రెసు పార్టీలో చేరుతుందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలను ఆమె అప్పుడే ఖండించింది. తాను అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటాను అంతేకానీ జగన్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. కానీ ఆమె తిరిగి కాంగ్రెసులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించలేదు కాబట్టి తాను ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేనని ఆమె చెప్పారు. ఈ నెల 25న జగన్ సమావేశానికి మర్యాదపూర్వకంగా వెళతానని చెప్పారట.

జగన్ ఆస్తులపై విచారణ నేపథ్యంలో ఆమె కొద్ది రోజులుగా నియోజక వర్గ కార్యకర్తలతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లోనే ఉండాలంటూ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలిసిన భారతి పార్టీలోకి వచ్చేందుకు అనుమతి తీసుకున్నారని సమాచారం. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆమెను ఫోన్ ద్వారా ఆహ్వానించారట. ఈ పరిణామాల నేపథ్యంలో సొంతగూటికి చేరేందుకు ఆమె చకచకా పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.

సోమవారం మధ్యాహ్నం ఆమె సన్నిహిత కార్యకర్తలతో జరిపిన సమావేశంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే శ్రేయస్కరమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం వజ్రపుకొత్తూరులో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరుకావాలని భారతి నిర్ణయించుకున్నారు. సిఎంకు తన సుముఖత తెలిపి 25వ తేదీ తరువాత లాంఛనంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

English summary
Tekkali MLA Korla Bharathi changed her words. She said yesterday that she will elected from Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X