న్యాయం జరిగిందన్న టిడిపి,బాబు పత్రాలందలేదన్న జెడి

మరోవైపు టిడిపి నేతలు కూడా సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. మేం ఊహించిందే జరిగిందన్నారు. సుప్రీం తీర్పుతో హైకోర్టులో తమకు వాదనలు వినిపించే అవకాశం వస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అప్పీలుకు వెళ్లింది వ్యక్తులే కాని తమ అధినేత చంద్రబాబు కాదన్నారు. హైకోర్టు తమ వాదనలు వినలేదనే అప్పీలుకు వెళ్లామని ఇప్పుడు సుప్రీం డైరెక్షన్ తమకు సంతృప్తినిచ్చిందన్నారు.
కాగా చంద్రబాబు విచారణకు సంబంధించిన పత్రాలు తమకు అందలేదని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ హైదరాబాదులో అన్నారు. కోర్టు నుండి పత్రాలు అందగానే విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు కేసులో నోటీసులు అందజేసిన తర్వాతే విచారణ చేపడతామని అన్నారు.












Click it and Unblock the Notifications