ప్రణబ్ మాటలు వినేది లేదు: తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని తాము ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు వారు తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని తాము ముందే చెప్పామని, అదే చేశామని వారన్నారు. తెలంగాణ ఆకాంక్షను మూడు రోజులుగా పార్లమెంటులో ప్రతిబింబింపజేస్తున్నామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని వారు చెప్పారు. అధికార పార్టీ ఇచ్చిన హామీని 700 మంది ప్రాణత్యాగాల నేపథ్యంలోనైనా అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం అసంభవమని వారన్నారు. తమను నియంత్రించడానికి ప్రయత్నిస్తే రెట్టింపుగా ఎదిరిస్తామని వారన్నారు. తమను నియంత్రించవచ్చు గానీ ప్రజలను నియంత్రించలేరని వారన్నారు.












Click it and Unblock the Notifications