హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలక్ష్మి నిజం చెబితే న్యాయం: మైనింగ్ వ్యాపారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilakshmi-Rajagopal
హైదరాబాద్: మాజీ గనుల శాఖ అధికారి శ్రీలక్ష్మి వాస్తవాలు చెబితే తమలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందని మైనింగ్ వ్యాపారి శశి కుమార్ గురువారం అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ఓబుళాపురం గనుల వ్యవహారంలో సహకరించినట్లు శ్రీలక్ష్మి, రాజగోపాల్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఇద్దరు అధికారులు తనను కొన్నేళ్లపాటు వేధించారన్నారు. అవినీతికి పాల్పడ్డ అధికారులకు ఏ సంస్థలూ సహకరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తప్పు చేసిన అధికారులు తమ హోదాలతో కేసుల నుండి బయటపడాలని చూస్తున్నారన్నారు. ఐఏఎస్ అధికారుల్లో చాలామంది నిజాయితీగా పని చేసే వారు ఉన్నారన్నారు. రాజగోపాల్ తనకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరటం సిగ్గుచేటన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తప్పు చేయలేదని చెబుతున్న ఆ అధికారులు కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయంలో ప్రమాణం చేయటానికి సిద్ధమా అని ప్రశ్నించారు.

కాగా గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని బ్రాహ్మణీ స్టీల్స్ విషయంలో జమ్మలమడుగు ఆర్డీవో వెంకట రమణా రెడ్డి గురువారం సిబిఐ అధికారుల ఎదుట హాజరయ్యారు.

English summary
Sasi Kumar appealed to Srilaxmi to told true in Gali Janardhan Reddy case before CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X