జగన్‌కు విషయం చెప్పేశా: శేషారెడ్డి, భారతిదీ అదే దారి

అనంతరం సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకన్నానని, తనకు రాజకీయాల కన్నా నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమన్నారు. నేను జగన్ వ్యవహారశైలి నచ్చక తిరిగి రాలేదన్నారు. ఆయన చాలా మంచివారని, సన్నిహితంగా ఉంటారన్నారు. కేవలం అభివృద్ధి కోసమే తిరిగి వచ్చానన్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్ నుండి దివంగత వైయస్ పేరును తొలగించాలని ఇప్పటికీ కోరుకునే మొదటి వ్యక్తిని నేనన్నారు. సిఎం అవినీతిరహిత పాలన అందిస్తూ, యువతకు ఉద్యోగాలు చూపిస్తున్నారని ప్రశంసించారు.
కాగా జగన్ వర్గం ఎమ్మెల్యేల సమావేశం మొదట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిని మార్చారు. భేటీ కార్యాలయం నుండి జగన్ ఇంటికి మారింది. మరోవైపు జగన్ వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications