మాట వినం!: ఆజాద్ విజ్ఞప్తిని తిరస్కరించిన టి-ఎంపీలు

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ విజ్ఞప్తిని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు శుక్రవారం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఎంపీలు మూడు రోజులుగా పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటుండటంతో ఆజాద్ ఉదయం వారికి ఫోన్ చేశారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవద్దని సూచించారు. కేంద్రం త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు నిరీక్షించాలని సూచించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఆజాద్ విన్నపాన్ని ఎంపీలు సున్నితంగా తిరస్కరించారు.

తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు తాము తమ ఆందోళన ఆపేది లేదని ఎంపీలు చెప్పారు. తాము పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం లేదని పార్టీ అధికారికంగా ప్రకటించిన అంశాన్ని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. తమ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు. తమను హెచ్చరించడం ద్వారా తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లుగా భావిస్తున్నామన్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

కాగా మంగళవారం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణ ప్రాంత ఎంపీలు లోకసభలో ప్రత్యేక రాష్ట్రం కోసం గందరగోళం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ సభలో హోరెత్తిస్తున్నారు. వారి చర్యలపై కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ గురువారమే సీరియస్ అయ్యారు. శుక్రవారం ఆజాద్ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఎంపీలు మాత్రం తమ ఆందోళనపై తగ్గేది లేదని వారిద్దరికీ స్పష్టం చేసినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+