ప్రచారం కోసం నాకు పేపర్, ఛానల్ లేదు: సిఎం కిరణ్

సమస్యలు అధిగమించడానికే అధిక సమయం తీసుకుంటుందని ఇక నుండి అభివృద్ధి పుంజుకుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదో ఒక అడ్డంకి వస్తుందని వీలైనంత త్వరగా వాటిని నిర్వహిస్తామని చెప్పారు. సరైన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. అందరికీనీ కలుపుకొని ముందుకు వెళతానన్నారు. జిల్లాల్లో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ శ్రేణుల మధ్య బేధాభిప్రాయాలు వాస్తవమేనని వాటిని అధిగమిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తాను ఎక్కువగా మాట్లాడనన్నారు.
సిబిఐ కేసుల విషయంలో ప్రభుత్వం పాత్ర లేదని కోర్టు ఆదేశాల మేరకే దర్యాఫ్తు జరుగుతోందన్నారు. ఐకమత్యం లేనప్పుడే కాంగ్రెసు పార్టీ ఓడిపోతుందన్నారు. బాబు అవిశ్వాసం పెడితే స్వాగతిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కొత్త పథకాలు నేరుగా ప్రజలకు చేరువవుతున్నాయన్నారు. పిసిసి చీఫ్ బొత్సతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications