కిషన్‌జీ మృతిపై దర్యాప్తు, వాస్తవం తేలుస్తామన్న సిఐడి

కిషన్‌జీని గురువారానికి ముందే అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపేశారని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవర రావు ఆరోపించారు. కిషన్‌జీ మృతదేహాన్ని గుర్తించడానికి వచ్చిన ఆయన సోదరుడి కూతురు దీపా రావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎదురు కాల్పులు జరిగాయనేది వాస్తవం కాదని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మోహన్ సింగ్ అన్నారు. అయితే, ఎదురు కాల్పుల్లోనే కిషన్‌జీ మరణించాడని మిడ్నాపూర్ ఎస్పీ వర్మ అంటున్నారు. తమకు చిక్కిన ఓ వ్యక్తి ద్వారా తాము కిషన్‌జీ స్థావరాన్ని కనిపెట్టగలిగామని, రాష్ట్ర సరిహద్దులను మూసేయడం వల్ల పారిపోవడానికి కిషన్‌జీకి వీలు కాలేదని, భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications