దొరికిపోయిన కెవిపి వియ్యంకుడు, ఐటి సోదాల్లో రట్టు?

ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది - ఆ తర్వాత జరిపిన సోదాల్లో వైఎస్ జగన్ సంస్థల్లో కోల్‌కతాకు చెందిన అల్లిబిల్లి కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లే రఘు రాజు కంపెనీల్లోకి కూడా డబ్బులు ప్రవహించినట్లు గుర్తించారు. రఘురాజు కుమార్తె ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులకు ప్రయత్నించినప్పటికీ ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఆగిపోయినట్లు సమాచారం. రఘు రాజు వద్ద ఏకంగా రూ.110 కోట్ల బ్లాక్ మనీ వివరాలు బయటపడటం, ఆయనకు ఎమ్మార్‌లో విల్లా, నాలుగు ప్లాట్లు ఉన్నట్లు తెలియడంతో దీనిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. రఘు రాజును పిలిచి ప్రశ్నించారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు తాను చదరపు గజం ఐదు వేలకే కొన్నానని, బ్లాక్‌లో ఏమీ ఇవ్వలేదని చెప్పినట్లు సమాచారం. తన వ్యవహారాలతో కెవిపికి సంబంధం లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలను పరిశీలించిన తర్వాత రఘురాజు అబద్ధం చెబుతున్నాడని సిబిఐ తేల్చుకున్నట్లు తెలస్తోంది.












Click it and Unblock the Notifications