కళ్లు మూసుకుని విజయమ్మ సంతకం పెట్టారు: సోమిరెడ్డి

భర్త వైయస్ రాజశేఖర రెడ్డి, కుమారుడు వైయస్ జగన్ పీకల లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి సాక్ష్యాలతో కూడా దొరికిపోయిన స్థితిలో దాని నుంచి దృష్టి మళ్లించడానికే వైయస్ విజయమ్మ చంద్రబాబుపై పిటిషన్ వేశారని ఆయన అన్నారు. కెజి బేసిన్ విషయంలో చంద్రబాబు హయాంలో ముఖేష్ అంబానీకి మేలు చేశారనే ఆరోపణను ఆయన ఖండించారు. వైయస్ జగన్ ముఖేష్ అంబానీ వద్దకు వెళ్లి బ్లాక్ మెయిల్ చేయాలని అనుకున్నాడని, ముఖేష్ అంబానీ జగన్‌ను కలుసుకోకుండా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను కలిశారని, అప్పుడు సోనియా వైయస్ రాజశేఖర రెడ్డిని చీవాట్లు పెట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరిస్తూ ఆ విషయాలు నిజం కావా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications