వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వస్తే ఎక్కడున్నాయో చూపిస్తా: సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీ అధినేత వస్తే పదిహేను లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయో చూపిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం మల్కాజిగిరిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షాలు ఉద్యోగాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారని వారొస్తే చూపించేందుకు సిద్ధమన్నారు. వరల్డ్ బ్యాంక్ నిధులతో రాష్ట్రంలో నీటి సరఫరాను అభివృద్ధి చేస్తామన్నారు. మల్కాజిగిరిలో తాగునీటికి రూ.270, రాష్ట్రంలో రూ.1600 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. గోదావరి జలాలను హైదరాబాదు తరలించేందుకు రూ.3800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

ఎలాంటి ఒత్తిళ్లకు, సిఫార్సులకు తలొగ్గకుండా అర్హులకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సత్వరమే గ్రూప్ -2 నియామకాలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. జిహెచ్ఎంసీలో రూ.1200 కోట్లతో రహదారులు, వంతెనలు, పార్కులు నిర్మిస్తామని చెప్పారు. డిసెంబరులో లక్షకు పైగా ఉద్యోగాలకు నోటీఫికేషన్ జారీ చేసి జనవరిలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా వాటిని ఇస్తామన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said today that he will show employement vacancies to TDP chief Nara Chandrababu Naidu if he come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X