విజయమ్మ ఆరోపణలకు ఆధారాలు లేవు: చంద్రబాబు

తన హయాంలో పారదర్శకమైన పాలనను అందించినట్లు ఆయన చెప్పుకున్నారు. సింగపూర్‌లో తనకు హోటల్ ఉందని చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆయన అన్నారు. గతంలో తనపై ఎన్నో కేసులు వేసినా అన్నీ వీగిపోయాయని ఆయన గుర్తు చేశారు. హైకోర్టులో తన వాదనను వినిపించడానికే వెకేట్ పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. తన ఆస్తుల కేసులో హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించడంపై చంద్రబాబు సోమవారం వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ కూడా వెకేట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు సూచన మేరకు వారు హైకోర్టులో వెకేట్ పిటిషన్ వేశారు.












Click it and Unblock the Notifications