శ్రీలక్ష్మి విదేశాలకు చిత్తగించే ప్రమాదం: అరెస్టుపై సిబిఐ

గాలి జనార్దన్ రెడ్డికి మేలు కలిగే విధంగా శ్రీలక్ష్మి రెండు జీవోలు జారీ చేశారని, మైనింగ్ వ్యాపారి శశికుమార్‌ను లంచం అడిగారని, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలని తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వానికి నష్టం కలిగించారని సిబిఐ ఆరోపించింది. అయితే, సిబిఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు సోమవారం సాయంత్రం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. ఆమెను రేపు సిబిఐ కోర్టు ముందు హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. సిబిఐ కార్యాలయంలో గానీ మహిళా పోలీసు స్టేషనులో గానీ ఉంచాలని ఆదేశించింది.
తాను సిబిఐ కార్యాలయంలోనే ఉంటానని శ్రీలక్షి చెప్పారు. దీంతో ఆమె వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను పెట్టి సిబిఐ కార్యాలయంలో ఉంచారు. తాను హృద్రోగంతో బాధపడుతున్నానని చెబుతూ అందువల్ల తనను సిబిఐ కస్టడీకి అప్పగించాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కూడా ఆమె కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications