తొలగని ప్రతిష్టంభన, ఎఫ్‌డిఐపై పార్లమెంటు వాయిదా

అంతకు ముందు మంగళవారం అఖిల పక్ష సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు పక్షాలు కూడా తమ పట్టును వీడలేదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల మనోభావాలను ప్రధానికి తెలిపి, ప్రభుత్వం ప్రతిస్పందించడానికి కొంత సమయం కావాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు బిఎస్‌పి నాయకుడు సతీష్ చంద్ర మిశ్రా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల లోపు ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాలని ప్రతిపక్షాలు చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications