రాత్రంతా శ్రీలక్ష్మి జాగారం, పోలీసులతో బాధలు ఏకరవు!

Srilaxmi
హైదరాబాద్: గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సోమవారం సాయంత్రం అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రాత్రంతా జాగారం చేశారట. ఆమెను అరెస్టు చేసిన తర్వాత సిబిఐ కోర్టులో హాజరు పర్చింది. ఆమె సిబిఐ అదుపులో ఉండేందుకు నిర్ణయించుకుంది. దీంతో ఆమెను సిబిఐ కార్యాలయానికి తరలించి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను కాపలా ఉంచారు. ఆమె రాత్రంతా జాగారం చేసి తనకు భద్రతగా ఇచ్చిన కానిస్టేబుళ్లతో బాధలు ఏకరువు పెట్టారట. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని, గాలి చేసిన తప్పుకు ఇప్పుడు తాను బలి కావాల్సి వస్తుందని ఆవేదన చెందారు. తనకు ఏ పాపం తెలియదని, జివోలు యథాలాపంగా, ప్రభుత్వ ఒత్తిడి వల్లనే జారీ చేశానని వారికి ఆవేదనగా చెప్పారు. తాను రాజగోపాల్‌పై ఎలాంటి ఒత్తిడి చేయలేదని చెప్పారు.

ఉదయం ఆమె ఓ గంట పాటు ఇష్ట దైవానికి పూజలు చేశారు. కాగా ప్రత్యేక కోర్టు మూడు రోజుల రిమాండుకు అప్పగించడంతో సిబిఐ అధికారులు శ్రీలక్ష్మిని కోఠిలోని తమ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. మరోవైపు తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు డిసెంబర్ 2వ తేదికి వాయిదా వేసింది. కాగా గాలి, శ్రీనివాస్ రెడ్డిలతో సంబంధాలు, ఆమెపై ఎవరు ఒత్తిడి తీసుకు వచ్చారు, రికవరీ, ముడుపుల తదితర అంశాలపై వివరాలు తీసుకునేందుకు శ్రీలక్ష్మిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు.

అందుకు శ్రీలక్ష్మి తరఫు లాయర్, ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులు శ్రీలక్ష్మి ముడుపులు తీసుకున్నట్లు చెప్పలేదని, లావాదేవీలు ఈమె ద్వారానే జరిగాయన్నది కేవలం సిబిఐ ఊహాజనితమేనని, ఆమెను ఐదుసార్లు విచారణకు పిలిపించి ఖాళీగా కూర్చోబెట్టారన్నారు. అన్ని విషయాలపైన అధికారులకు ఆమె సమాధానమిచ్చారని కాబట్టి సిబిఐ కస్టడీ అవసరం లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+