మంత్రులూ! సిఎంకు బుద్ది చెప్పండి: కెసిఆర్ సూచన

K Chandrasekhar Rao
వరంగల్: తెలంగాణ ప్రాంత మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం సూచించారు. వరంగల్‌లోని ఎంజిఎంలో చికిత్స పొందుతున్న చెరుకు సుధాకర్‌ను కెసిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయించే దిశలో తెలంగాణ మంత్రులు ఆయనపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.

పిడి యాక్టులు, అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తున్నారని విమర్శించారు. టి-మంత్రులకు కెబినెట్‌లో కొనసాగే హక్కు లేదన్నారు. అకారణంగా అరెస్టు చేసిన సుధాకర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుధాకర్ విడుదల కోసం తాము హైకోర్టులో పోరాటం చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 9 అమలుకే తమ ఉద్యమమని, అక్రమ నిర్బంధాలు, కేసులకు భయపడేది లేదన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+