బాబుపై దుమ్మెత్తిపోసిన మంత్రులు, దిగుజారుడని వ్యాఖ్య

సంతాపం తీర్మానాన్ని అడ్డుకున్న సంప్రదాయం చట్టసభలో ఇప్పటి వరకు లేదని, ఇది ఇప్పుడే చూస్తున్నామని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నాైరు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అన్నీ తెలిలినవాడు అయిన చంద్రబాబు ఇంత నీచానికి దిగజారుతాడని తాను అనుకోలేదని ఆయన అన్నారు. ఇది శాసనసభ చరిత్రలో బ్లాక్ డే అని ఆయన అన్నారు. సహచర సభ్యుడు మరణిస్తే సభలో సంతాపం ప్రకటించాల్సిన బాధ్యత ఉంటుందని మరో మంత్రి పార్థసారథి అన్నాైరు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిందని ఆయన అన్నారు. తాము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్పినా తెలుగుదేశం పార్టీ సభను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications