విశ్వాసం నోటీసును ఇచ్చారు, జగన్, కెసిఆర్‌కు సవాల్

Mothukupally Narasimhulu-Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గురువారం ఉదయం అవిశ్వాసం నోటీసును అసెంబ్లీ కార్యదర్శికి అందజేసింది. టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, దూళిపాళ్ల తదితర నేతలు నోటీసులు అందజేశారు. ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు అవిశ్వాసం నోటీసు ఇచ్చినట్లు కార్యదర్శి సంతకం చేశారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. అవిశ్వాసం పెట్టాలని ప్రగల్భాలు పలికిన వాళ్లకు అవిశ్వాసం ఓ సవాల్ అన్నారు. జగన్ ఇప్పుడు ఎటువైపో తేలుపోతుందన్నారు. తనతో యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధం కావాలన్నారు.

రైతులను ఆదుకోవడంలో కిరణ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోంది ధ్వజమెత్తారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంలో భాగమే అవిశ్వాస తీర్మానం అన్నారు. ఇప్పుడు ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలుతుందన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

సకల జనుల సమ్మెను కెసిఆర్ సకల సంపదగా మార్చుకున్నారన్నారు. జగన్, కాంగ్రెసు, టిఆర్ఎస్ మూడు తోడు దొంగలే అన్నారు. కాగా అవిశ్వాస తీర్మానం కెసిఆర్, జగన్‌లకు ఓ సవాల్ అని టిడిపి నేతలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+